మూవీ ఆర్టీస్ట్ అసోషియేషన్ (మా) నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా గడవకముందే అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ‘మా’ లో వర్గపోరు తారా స్ధాయికి చేరుకుంది. ఇటివలే మా ఎన్నికలు రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈపోరు శివాజి రాజా పై నరేష్ విజయం సాధించారు. అధ్యక్షడిగా నరేష్, ఉపాధ్యక్షుడిగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
అయితే తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ఆపదవికి రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. మా అసోసియేషన్ డబ్బుతో ప్రభుత్వ పథకాలపై ప్రకటనలు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్న పనులు అందరికి తెలియ చేయడం కోసమే ఖర్చు చేశాం తప్ప మరో ఉద్దేశం కాదంటున్నారు నరేష్ వర్గీయులు.
మరోవైపు సంఘ కార్యదర్శి, నటి జీవిత మాత్రం మా అసోసియేషన్ లో తాము అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మా జనరల్ బాడీ మిటింగ్ జరుగనుందని..ఆసమావేశంలో ఈ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మా లో వర్గ పోరు తారా స్దాయికి చేరినట్లు స్పష్టంగా అర్దమవుతుంది.