రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ సెలబ్రెటీ

676
pooja Ramachandran

బిగ్ బాస్ సీజన్ 2లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ తాజాగా రెండో పెళ్లి చేసుకుంది. పూజా రామచంద్రన్ కు గతంలో వీజే తో పెళ్లి జరిగింది. రెండు సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్యలో మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ నటుడు జాన్ కొక్కెన్ తో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న పూజా తాజాగా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అఫీషియల్‌‌గా ప్రకటించింది పూజా రామచంద్రన్.

కేరళ సాంప్రదాయంలో తమ పెళ్లి జరిగిందని పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. జాన్ కొక్కెన్‌ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. గతంలో మీనా వాసుదేవన్ అనే నటిని పెళ్లి చేసుకుని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇటివలే సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ మూవీలో జాన్ కొక్కెన్ విలన్ నటించిన విషయం తెలిసిందే. ఈసినిమాలో జాన్ కొక్కెన్ నటనకు మంచి పేరు వచ్చింది.

పూజా రామచంద్రన్ తెలుగులో లవ్ ఫెయిల్యూర్, చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్, మరల తెలుపనా ప్రియా, క్రిష్జార్జున యుద్దం, దోచెయ్ పలు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాలు ఒక్కటి కూడా విజయం సాధించకపోవడంతో పూజాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పూజా బిగ్ బాస్ తో బాగా ఫేమస్ అయ్యింది.