పుష్ప.. పక్కా అల్లు అర్జున్ షో:సుకుమార్

25
pushpa

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుకుమార్….బన్నీని ఆకాశానికెత్తేశాడు.

ఇది అల్లు అర్జున్ సినిమా..పుష్ప చూసిన త‌ర్వాత అల్లు అర్జున్ యాక్టింగ్‌కు స్ట‌న్‌ అయిపోతారు. ప్ర‌తీ ఒక్క‌రు అల్లు అర్జున్ ప‌ర్ ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిర్మాత‌లు చాలా ఓపిక‌గా న‌న్ను భ‌రించినందుకు ధ‌న్య‌వాదాలు చెప్పారు.

నిర్మాత‌లైన‌ న‌వీన్‌, ర‌వికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. సినిమా విడుద‌లయ్యే వ‌ర‌కు వాళ్లు ఎందుక‌ని నన్ను ఒక్క ప్ర‌శ్న కూడా వేయలేదు. సినిమాకు అద్బుత‌మైన సంగీతంతో బ్యాక్ బోన్‌గా నిలిచిన‌ త‌న డార్లింగ్ దేవీ శ్రీప్ర‌సాద్‌కు థ్యాంక్స్ చెప్పాడు సుకుమార్‌.