ఖుషీకి బ్రేక్‌లు లేవు….

76
- Advertisement -

యశోద సినిమా తర్వాత సమంత మయోసైటిస్‌కు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఒప్పుకున్న సినిమాలను కూడా చేయలేని పరిస్థితిల్లో ఉన్న సమంత…ఖుషీ సినిమాకు బ్రేక్ పడింది. దీంతో టాలీవుడ్‌లో గుసగుసలు మొదలైనవి. ఖుషీ సినిమాకు అనవసరంగా సమంత ఒప్పుకుంది. లేకపోతే ఈ సినిమా ఈ పాటికే విడుదల అయ్యి ఉండేదని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఖుషీ సినిమా దర్శకుడు శివ నిర్వాణ అప్‌డేట్ ఇచ్చారు. విజయ్‌దేవరకొండ సమంత నటిస్తోన్న ఖుషీ సినిమా దాదాపుగా 60శాతం చిత్రీకరణ ముగించుకొంది.

శివ నిర్వాణ ట్విట్టర్‌ ద్వారా అతి త్వరలోనే ఖుషి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఇక నుంచి అంతా సజావుగా సాగుతుందని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఒక కొత్త లుక్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో విజయ్‌ అభిమానులు ఆనందంతో ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి…

ఆ ముదురు ప్రేమ జంట బ్రేకప్ ?

లేటు వయసులో మళ్లీ హీరోయిన్ గా

బాడీ షేమింగ్ గురైన భామలు వీళ్ళే

- Advertisement -