దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం..

84
shekar kammula

్దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య(89) మృతిచెందారు దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా ఇవాళ సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది.