ఒక్క హిట్ కే కోటి పెంచిన దర్శకుడు

170
- Advertisement -

యంగ్ డైరెక్టర్స్ లో శైలేష్ కోలేను కి మంచి పేరు ఉంది. బాగా చదువుకున్న వ్యక్తి అని, మంచి విజువల్ సెన్స్ ఉన్న దర్శకుడు అని ఇండస్ట్రీలో అతని పై మంచి హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్ ను శైలేష్ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఐతే, హిట్ 2 విజయం ముందు శైలేష్ కోలేను వేరు. హిట్ 2 రిలీజ్ తరువాత శైలేష్ కోలేను క్రేజ్ వేరు. ఈ తేడా కారణంగా ఇప్పుడు నిర్మాతలకు కోటి ఎక్కువ లెక్కవుతునట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే శైలేష్ కోలేను సితారా బ్యానర్ కి ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

నిజానికి హిట్ 2 సినిమాకి దర్శకుడు శైలేష్ కోలేను కోటి వరకు రెమ్యూనిరేషన్ ను తీసుకున్నాడు. అంతలో ‘హిట్ 2’ సినిమా హిట్ అయింది. వాస్తవానికి హిట్ 2 బ్లాక్ బస్టర్ హిట్ ఏమీ కాలేదు. కానీ, దర్శకుడు శైలేష్ కోలేను బ్రాండ్ వాల్యూ మాత్రం పెరిగింది. వరుసగా మినిమమ్ గ్యారెంటీ హిట్ లు అందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు శైలేష్ కోలేను కి డిమాండ్ పెరిగింది. ఫలితంగా శైలేష్ కోలేను క్రేజ్ మామూలుగా పెరగలేదు. దాంతో ఇప్పుడు తన రెమ్యూనిరేషన్ ను శైలేష్ కోలేను రివైజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు శైలేష్ కోలేను మినిమమ్ తన రెమ్యూరేషన్ ను 2 కోట్ల మేరకు ఫిక్స్ చేసినట్లు బోగట్టా. గమ్తత్తేమిటంటే అంతకు ముందే శైలేష్ కోలేను సితారా సినిమా ఒప్పుకున్నారు. దానికి రెమ్యూనిరేషన్ మొదట కోటి ఒప్పుకున్నారు. ఇప్పుడు అది కూడా రివైజ్ అవుతుంది. కానీ ఇప్పుడంటే ఇప్పుడే కాదు. సినిమా స్టార్ట్ కావాలి, పూర్తి కావాలి. అప్పటి పరిస్థితిని బట్టి వుంటుంది శైలేష్ కోలేను వ్యవహారం ఉంటుంది.

ఇవి కూడా చదవండి…

వినూత్న చిత్రానికి సెన్సార్ నుంచి ప్రశంసలు

చెప్పాలని ఉందిలో కథే పెద్ద హీరో:యష్

పవన్ తో హరీశ్ లైన్ క్లియర్

- Advertisement -