వినూత్న చిత్రానికి సెన్సార్ నుంచి ప్రశంసలు

133
- Advertisement -

శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న చిత్రం ‘@లవ్’. ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. చక్కని ఏమోషనల్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుందట.

వైవిధ్యంగా ఉండి సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి. ఇప్పుడు ‘@లవ్’ అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింది అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉందని.. మరో వినూత్న సినిమాగా నిలుస్తోందని తెలుస్తోంది. మంచి సినిమా రావడం లేదు అని బాధ పడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే సినిమా ఇది. అందుకే, ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు శ్రీ నారాయణ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని ఈ సినిమాలో శ్రీ నారాయణ చూపించిన విధానం అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ @లవ్ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక కథ ఉందని.. ప్రతి పాత్రకు ఓ ఎమోషన్ ఉందని.. ప్రతి ఎమోషన్ కథను డ్రైవ్ చేస్తోందని చెబుతున్నారు. అసలు ఇలాంటి ప్రేమ కథలో అద్భుతమైన ఎమోషన్స్ ను పెట్టడం నిజంగా అద్భుతం. మొత్తానికి ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుందట. ఇక ఈ చిత్రాన్ని TMS బ్యానర్ తో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ సంయుక్తంగా మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మించారు.

ఇవి కూడా చదవండి…

పవన్ తో హరీశ్ లైన్ క్లియర్

2023లో బాలీవుడ్‌ స్టార్ కిడ్స్‌ ఎంట్రీ…

డిసెంబర్‌ 9న…చిన్న సినిమాల పండగ

 

- Advertisement -