నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడతా..ఎవడాపుతాడో చూస్తాః వర్మ

198
rgv

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో విడుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఒక్క ఏపీలో తప్ప మిగతా రాష్ట్రాలలో మార్చి 29న ఈమూవీ విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత నందమూరి ఫ్యామిలీలో జరిగిన సన్నివేశాలను ఈసినిమాలో చూపించారు వర్మ. అయితే ఇటివలే ఎపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదలను ఆపాలని కోర్టులో కేసు వేశారు టిడిపి నేతలు.

ఈ కేసును పరిశీలించిన కోర్టు ఎన్నికల ముగిసే వరకు సినిమా విడుదలను ఆపివేయాలని తీర్పునిచ్చింది. తాజాగా ఈసినిమా ఏపీలో మే1న విడుదల కానున్నట్లు తెలిపారు వర్మ. ఈసందర్భంగా ఈరోజు విజయవాడ నొవాటెల్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. కానీ తాజాగా మరో ట్వీట్ చేస్తూ నోవాటెల్ హోటల్ తనను ప్రెస్ పెట్టకుండా కొంత మంది అడ్డుకుంటున్నారు.. ప్రెస్ మీట్ కు పర్మిషన్ ఇవ్వకూడదని హోటల్ యాజమన్యాన్ని కొంత మంది బెదిరిస్తున్నారని ట్వీట్ చేశారు.

ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టల్స్‌, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు . ఈ నేప‌థ్యంలో పైపుల రోడ్డులో ఎన్టీఆర్ స‌ర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా . మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ‌లో పాల్గొన‌టానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ వ‌ర్మ త‌న ట్వీట్‌లో తెలిపారు. వర్మ ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడంతో…ప్రెస్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా నెలకొంది.