బోత్స సోదరుడి కుమార్తె వివాహానికి హాజరైన జగన్

300
YS Jagan At Botsa Brother Daughter Marriage

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సోదరుడి కుమార్తె వివాహానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం హాజరయ్యారు. రుషికొండలోని ఓ రిసార్ట్స్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. పెండ్లి కుమార్తె యామిని, పెండ్లికుమారుడు రవితేజలను ఆశీర్వదించారు. బొత్స సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహం విశాఖకు చెందిన రవితేజతో జరిగింది.

YS Jagan At Botsa Brother Daughter Marriage

స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు. వైఎస్ జగన్ ను చూసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. జై జగన్, సీఎం అంటూ నినాదాలతో పెళ్లిమండపాన్ని హోరెత్తించారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.