అవెంజర్స్ తొలిరోజే అబ్బురపరిచే కలెక్షన్లు..

156
avengers-endgame

ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్. రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈసినిమా భారీ విజయం సాధించడంతో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఇంగ్లీష్ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ ని ఈ సినిమా సాధించి రికార్డ్స్ సృష్టించింది.

తెలుగులో బాహుబలి ని బ్రేక్ చేసి నెంబర్ వన్ స్ధానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ధియేటర్లలో ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ సినిమానే ప్రదర్శించబుతుంది. ఈమూవీ దెబ్బకు మిగతా సినిమాలు ఢీలా పడిపోయాయి. గతేడాది వచ్చిన ‘ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ మొదటి రోజు రూ.31 కోట్ల 30 లక్షల షేర్ రాబడితే ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ తొలిరోజు రూ. 63 కోట్ల 21 లక్షల గ్రాస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగెఅవకాశం ఉంటుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.