సినిమా తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే తీసిన సినిమాను ప్రమోషన్స్ చేసుకోవడం మరో ఎత్తు. ప్రమోషన్స్ బాగా చేసుకుంటే విడుదలకు ముందే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఈవిద్యలో రామ్ గోపాల్ వర్మను మించిన వారు ఉండరని చెప్పుకోవాలి. సినిమా ఎప్పుడు తీస్తాడో తెలిదు కానీ విడుదల సమయానికి మాత్రం ఏదో ఒక కౌంటర్ వేసి ఆ సినిమాను అమాంతం పైకి లేపుతాడు.
ఇటివలే ఆయన నిర్మించిన సినిమా భైరవగీత. సిద్దార్ధ ఈసినిమాకు దర్శకత్వం వహించగా రామ్ గోపాల్ వర్మ, అభిషేక్ నామాలు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 30వ తేదిన ఈసినిమా విడుదల చేయనున్నారు.
ఈసందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ఒక డబ్బున్న అమ్మాయికి .. ఒక పేద కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథే ‘భైరవగీత’. ఆ ఇద్దరి ప్రేమ చుట్టూనే కథ తిరుగుతుందన్నారు వర్మ. సిద్దార్ధ నాకు కథ చెప్పినపుడు ఎంత కొత్తగా అనిపించిందో..సినిమాను చూస్తున్నపుడు కూడా అంతే కొత్తగా అనిపించిందన్నారు. ఈసినిమాలో చాలా మంది కొత్తనటీ, నటులను తీసుకున్నామని చెప్పారు వర్మ.