పూరీ శిష్యుడి దర్శకత్వంలో ఆకాశ్

349
puri jagannath akash
- Advertisement -

దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాశ్ ఆంధ్రపోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ కావడంతో దర్శకుడు పూరీ తనయుడితో మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటటైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నటన పరంగా మాత్రం ఆకాశ్ కు మంచి మార్కులే పడ్డాయి. మొదటి సినిమా ప్లాప్ కావడంతో రెండవ సినిమా కూడా పూరీ నే చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ పూరీ ప్రస్తుతం హీరోతో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో బిజీగా ఉన్నాడు.

Akash-Puri

దీంతో ఆకాశ్ ను తన శిష్యుడికి అప్పగించాడు పూరీ. గతంలో పూరీ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ పూడిరి ఆకాశ్ తో సినిమా చేయనున్నాడు. అనిల్ టాలెంట్ గురించి తెలిసిన పూరి, తన తనయుడి సినిమాను ఆయనకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈమూవీకి కూడా పూరీ జగన్నాథ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఎప్రిల్ లో ఈమూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈసినిమాతోనైనా ఆకాశ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

- Advertisement -