టీఆర్ఎస్‌..తిరుగులేని రాజకీయ శక్తి

293
ktr press club
- Advertisement -

టీఆర్ఎస్‌ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన కేటీఆర్ వంద సంవత్సరాల వరకు టీఆర్ఎస్‌ను ఎలాంటి అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబెట్టేలా వ్యుహాలు రచిస్తున్నామని చెప్పారు.

నిబద్దత,చిత్తశుద్దితో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. మీడియా బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు కేటీఆర్. కొన్ని సంస్థలు కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారం చేసిన ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు ప్రజలను కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పాత్రికేయులు మా వైపే నిలిచారని తెలిపారు కేటీఆర్. జర్నలిస్టులను అసెంబ్లీకి పంపించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రత్యేకదృష్టి సారిస్తామన్నారు.

ఎలాంటి ప్రతికూలతనైనా అధిగమించే శక్తి టీఆర్ఎస్‌కు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణను నిలబెట్టేందుకు అందరు సిద్ధంగా ఉండాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని చూసి దేశం అబ్బురపడుతోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -