నిఖిల్ హీరోగా తెరకెక్కిన యువత సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు పరుశరామ్. రవితేజతో ఆంజనేయులు,సారొచ్చారు…నారా రోహిత్‌తో సోలో సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా విజయ్ దేవరకొండతో గీతాగోవిందం సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో సర్కార్ వారి పాటను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు పరుశరామ్. అన్ని షేర్స్ కలుపుకొని 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.అయితే ప్రస్తుతం టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నారట. కరోనా నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటం, సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్ధితి లేకపోవడంతో పరుశరామ్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ , గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.