ఫ్యామిలీ స్టార్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నా:పరశురామ్

19
- Advertisement -

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది.

ట్రైలర్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ పెట్ల తనదైన హీరో క్యారెక్టరైజేషన్, మేకింగ్ స్టైల్ ను “ఫ్యామిలీ స్టార్”లో మరోసారి చూపించారు. ఈ సినిమా సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు పరశురామ్ పెట్ల. అందుకే ఆయన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘ ఐ ఫీస్ట్ లాంటి “ఫ్యామిలీ స్టార్” సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు.’ అని చెప్పారు. సమ్మర్ లో సకుటుంబంగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే మూవీ “ఫ్యామిలీ స్టార్” అని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

Also Read:KTR:ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే

- Advertisement -