రాజాసాబ్..4 రోజుల ఖర్చెంతో తెలుసా?

19
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న చిత్రం రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. వింటేజ్ లుక్ లో, లుంగీ కట్టుకున్న ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మారుతి. రాజాసాబ్ సినిమా 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తన మొదటి సినిమా ఈరోజుల్లోని కేవలం రూ.30 లక్షల బడ్జెట్‌తో తీశా కానీ రాజాసాబ్ మూవీకి నాలుగు రోజుల్లో రూ.4 కోట్లు ఖర్చు అయిందన్నారు. ప్రభాస్ సినిమా కాకపోతే ఇలా ఖర్చు పెట్టేవాడిని కాదన్నారు. ఆ బడ్జెట్‌లో ఖచ్చితంగా రెండు,మూడు సినిమాలు తీసేవాడినని తెలిపారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఇండియన్ టాప్ మూవీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాక్.

Also Read:Harishrao:చేరికలేనా..రైతు సమస్యలు పట్టవా?

- Advertisement -