నాని డైరెక్టర్‌తో రౌడీ హీరో..

168
Vijay Devarakonda
- Advertisement -

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో ఫైట‌ర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత మరో సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. అప్పట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్తలు వచ్చాయి. అయితే ఆ త‌ర్వాత‌ ఈ ప్రాజెక్టుకు పట్టాలెక్కుతుందో లేదో అని అనుమానాలు మొద‌ల‌య్యాయి.కానీ తాజాగా మ‌ళ్లీ ఈ చిత్రానికి సంబంధించిన వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

విజయ్ డేట్స్‌ సర్డుబాటు కాక ఈ సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని వార్త‌లు వచ్చాయి.. అయితే శివ నిర్వాణ మాత్రం 2021 జ‌న‌వ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్తుంద‌ని చెప్తున్నాడు. ప్ర‌స్తుతం శివ ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. డిసెంబ‌ర్ చివ‌రిక‌ల్లా షూటింగ్ పూర్తి చేస్తే..విజ‌య్ సినిమాపై ఫోక‌స్ పెట్ట‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నేది కూడా త్వ‌ర‌లోనే చెప్ప‌నున్నాడ‌ని సమాచారం.

- Advertisement -