మ‌హేష్‌ కూతురుకు అలియా స్పెషల్‌ గిఫ్ట్..

153
Alia Bhatt
- Advertisement -

బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు ష్యూటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చింది. ఆమె హైదరాబాద్‌కు వచ్చిన సంద‌ర్భంగా హీరో మ‌హేష్‌ బాబు కూతురు సితార‌కి ఓ గిఫ్ట్ తీసుకొచ్చింది. మరి ఆ బహుమతి ఏంటనేగా మీ సందేహం ఆలియా త‌న సొంత బ్రాండ్ దుస్తులు ప్ర‌త్యేకంగా సితార కోసం తీసుకొచ్చి ఇచ్చిందట.

అయితే సితార‌ వాటిని ధరించిన ఆ దుస్తుల్లో తనని తాను చూసుకుని మురిసిపోయింది. తనకెంతో ఇష్ట‌మైన హీరోయిన్ అలియా భ‌ట్ ఈ దుస్తులు తీసుకొచ్చిందని, ఈ డ్రెస్ తనకెంతో న‌చ్చిందని సితార ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, 2018లో మ‌హ‌ర్షి షూటింగ్ కోసం మ‌హేశ్ బాబు త‌న కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. ఆ స‌మ‌యంలో అలియా భ‌ట్ మూవీ షూటింగ్ కూడా అక్క‌డే జ‌రుగుతోన్న నేపథ్యంలో సితార-అలియాభట్ కలిసి మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చిట్టి సితారకు అలియాభట్ దుస్తులు తీసుకొచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న చెర్రీ పక్కన సీత పాత్రలో అలియా నటించనుంది.

- Advertisement -