అల..వైకుంఠపురంలో కథ నాదే

452
ala Vaikuntapuramlo
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. నాన్ బాహుబలి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు సాధించింది. ధమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈసినిమాకు మరో సమస్య వచ్చింది.

ఈమూవీ కథ నాదే అంటూ ఓ దర్శకుడు తెరపైకి వచ్చాడు. 2005లో తాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఈ కథ చెప్పినట్లు తెలిపాడు. అంతేకాకుండా 2013లో ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ కూడా చేశానన్నాడు. త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని త్రివిక్ర‌మ్‌కి ఇచ్చాన‌ని కూడా చెబుతున్నాడు కృష్ణ‌. అయితే త‌న క‌థ‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని త్రివిక్రమ్ తెర‌కెక్కించాడ‌ని ఆరోపిస్తున్నాడు కృష్ణ‌. దీంతో త్రివిక్రమ్‌కు నోటీసులు పంపుతానని చెప్పాడు.

- Advertisement -