మొక్కలు నాటుదాం.. భావితరాలకు బాటలు వేద్దాం..

542
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు సోమవారం రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరం ఒక్కో మొక్క నాటి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుని విజయవంతం చేద్దామని #EachonePlantone,గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పలువురు పాల్గొంటున్నారు.

kcr

తాజాగా నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, టీపీయూఎస్‌ అధ్యక్షులు గంధం రాములు, డా. V.మద్దిలేటి జాయింట్ డైరెక్టర్ లు డాక్టర్‌ బిఆర్ అంబెడ్కర్ పీజీ లెర్నర్ సెంటర్,జూబ్లీహిల్స్ ,హైదరాబాద్‌లో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీపీయుస్‌ సభ్యులు, ఐటీ మరియు ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

green india challenge

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ముగ్గురికి 1.డా.మద్దిలేటి డైరెక్టర్, Dr.బిఆర్‌ అంబెడ్కర్ యూనివర్సిటీ,2.తెలంగాణ ఐటీ ప్రెసిడెంట్ కట్టా రవి కుమార్, 3. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ అధ్యక్షులు షబ్బీర్ ఆలీకి ఛాలెంజ్‌ను విసిరారు.

harithaharam

- Advertisement -