ఆ ఇద్ద‌రు హీరోల‌కు హ్యాండిచ్చిన హ‌రీష్ శంక‌ర్..

345
harish shankar
- Advertisement -

దువ్వాడ జ‌గ‌న్నాథమ్ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న త‌ర్వాతి సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం దాగుడు మూత‌లు అనే టైటిల్ తో ఓ మ‌ల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేశాడు. ఈమూవీని ప‌ట్టాలెక్కించేందుకు నిర్మాత‌లెవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ కు ప‌ట్టాలెక్క‌లేదు.

varun tej, nagashourya

ఇటివ‌లే త‌మిళంలో విజ‌యం సాధించిన జిగ‌ర్తాండ మూవీని తెలుగులో రిమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు హ‌రిష్ శంక‌ర్. తమిళ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన బాబీ సింహా పాత్ర కోసం రవితేజను కలవగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. హీరోగా సిద్ధార్ద్ పాత్ర కోసం సాయి ధ‌ర‌మ్ తేజ్ ను క‌ల‌వ‌గా ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌.

ravi teja, sai dharam tej

వీరిద్ద‌రితో సినిమా చేద్దామ‌నుకున్న హ‌రీష్ శంక‌ర్ మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకుని హీరోల‌ను మ‌ర్చేశాడ‌ట‌. తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు వ‌రుణ్ తేజ్, నాగ‌శౌర్య‌ల‌తో ఈసినిమాను తీసేందుకు హరీశ్ శంక‌ర్ సిద్ద‌మ‌య్యాడ‌ని స‌మాచారం. త‌మ‌కు చెప్ప‌కుండా వేరే హీరోల‌తో సినిమా తీసేందుకు హ‌రీశ్ శంక‌ర్ సిద్దం కావ‌డంపై ర‌వితేజ‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ లు ద‌ర్శ‌కుడిపై సిరియస్ గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై వాస్త‌వ‌మెంతో తెలియాలంటే సినిమా ప్రారంభించే వర‌కూ వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -