పవన్ కళ్యాణ్‌కు తమ్ముడు మూవీ ఎంతటి సక్సెస్‌నిచ్చిందో తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు.. అరుణ్ ప్రసాద్. ఇటీవల నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కల్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ కల్యాణ్ గురించి అభిమానులకు తెలియని అనేక విషయాలను ఆయన వెల్లడించారు. పవన్ లాంటి వ్యక్తి అసలు రాజకీయాలకు సరిపోడని చెప్పారు.
తన వరకైతే పవన్ రాజకీయాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదని వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఎవరైనా ఏదైనా అంటే మాట పడతాడేమో గానీ, తిరిగి మరో మాట అనే మనస్తత్వం కాదని అరుణ్ ప్రసాద్ చెప్పారు. నేటి రాజకీయాలకు పవన్ అస్సలు సరిపోడని, పవన్ మాటల యుద్ధంలో గెలవలేడని, ఎదుటివారిని ఓ మాట అనడం పవన్‌కు తెలియదని అరుణ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఫిజికల్ ఫైట్ కన్నా.. మాటల్లో ఆరితేరిన వారే గెలుస్తారని అభిప్రాయ పడ్డారు. కాబట్టే పవన్ రాజకీయాలకు సరిపోడని, తన వరకు వస్తే పవన్ రాజకీయాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు.
అభిమానుల వల్లే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని, రాజకీయాల్లోకి వచ్చిన వారు మలినం కాక తప్పదని చెప్పారు. అలా కాకుంటే అవి రాజకీయాలే కావని అన్నారు. అంతేకాకుండా పవన్ సినిమాలు చేయకపోతే పొలిటికల్‌గా ఫ్యాన్స్ ఉండేవారు కాదని అన్నారు. అయితే ఈ అభిప్రాయం అరుణ్ ప్రసాద్ ఒక్కరిది మాత్రమే కాదు. పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో కూడా ఇలాంటి అభిప్రాయం సినీ వర్గం నుంచి వ్యక్తమైయ్యాయి.
‘అవి చెయ్యకపోతే..పవన్‌కి ఫ్యాన్స్ ఉండేవారు కాదు’
- Advertisement -
- Advertisement -