TMCలో అంతా అవినీతే!

3
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై దిలీప్ ఘోష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీ అవినీతి కూపంలో కూరుకుపోయిందని త్వరలోనే ఆ పార్టీ పూర్తిగా కుప్పకూలడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ప్రజాధనాన్ని టీఎంసీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని…వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.

శుక్రవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఎంసీ నేతలు ప్రజల సొమ్ముతో కోట్లు కూడబెట్టారు. అది వారి సంపాదన కాదు…కేంద్ర మరియు రాష్ట్ర సంక్షేమ పథకాల నుండి పేద ప్రజల పొట్టగొట్టి లూటీ చేసిన సంపద… దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడాలి అని దిలీప్ ఘోష్ అన్నారు.

రాష్ట్రంలో అమలువుతున్న ‘లక్ష్మీ భండార్’, ‘అన్నపూర్ణ భండార్’ వంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వ లబ్ధి పొందాలంటే మొదటగా భారత పౌరసత్వం కలిగి ఉండటం ప్రాథమిక నిబంధన అని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ప్రస్తావిస్తూ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ ల నుండి శరణార్థులుగా వచ్చి ఇప్పటికీ పౌరసత్వం పొందని హిందువుల కోసమే ఈ చట్టాన్ని తెచ్చినట్లు గుర్తుచేశారు.

Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

భారత పౌరసత్వం లేని వారెవరూ ఇక్కడి ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేరు. అలాంటి అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుండి వెళ్లగొట్టే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలిపారు.

- Advertisement -