‘బలగం’ షోస్ వేస్తున్న దిల్ రాజు

31
- Advertisement -

ప్రస్తుతం వరుస అపజయాలతో ముందుకెళ్తున్న దిల్ రాజు త్వరలో బలగం అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సమర్పకుడిగా ఉంటూ తన వారసులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. పాటలు ఒక్కొక్కటిగా వదులుతూనే మరో వైపు స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షో వేసి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది బలగం. ఈ రోజు నిజామాబాద్ లో మరో షో వేస్తున్నారు. అయితే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా సినిమా మన తెలుగు సినిమా అంటూ అందరూ చూసి గర్వపడేలా ఉంటుందని దిల్ రాజు చెప్పుకున్నారు.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఇది కేవలం తెలంగాణా సినిమా మాత్రమే కాదు ఇదొక తెలుగు సినిమా , కాకపోతే నటీ నటులు , నేపథ్యం అంతా తెలంగాణానే ఉంటుంది. మా బేనర్ లో వచ్చిన ఫిదా తెలంగాణ నేపథ్యం అయినప్పటికీ అందరూ ఆదరించి పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు బలగం కూడా అలాగే అందరికీ నచ్చే సినిమా అవుతుందని తెలిపాడు. ఈ సినిమా మీద దిల్ రాజు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇది తమ బేనర్ కి మరో శతమానం భవతి అవుతుందని ధీమా గా ఉన్నారు. ఈ సినిమా మార్చ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -