దిల్ రాజుతో అఖిల్…!

46
akhil
- Advertisement -

ఈ ఏడాది వ‌రుస సినిమాలో అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు హీరో అఖిల్. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తుండ‌గా అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇక ఈ సినిమా త‌ర్వాత దిల్ రాజు నిర్మాణంలో భారీ బ‌డ్జెట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

అఖిల్ న‌టించిన ఏజెంట్ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -