- Advertisement -
మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు త్రివిక్రమ్‌తో మహేశ్ సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కు ఇది 28వ సినిమా కాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం.
ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగనుండగా ఈ సంవత్సరం చివరికి సినిమా షూట్ పూర్తి చేసి 2023 వేసవిలో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే మరోసారి నటించనుంది. తమన్ సంగీతం అందించనున్నారు.
ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తుండగా రాగానే షూటింగ్ మొదలుకానుంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో సినిమా కూడా చేయనున్నారు మహేశ్.
- Advertisement -

