దిల్ రాజు టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కెరీర్‌లో ఎన్నీ సూపర్ హిట్ సినిమాలున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు చేసిన … చిన్న సినిమాలు చేసిన ఆయనకే చెల్లింది. ఐతే ఇప్పటివరకు తీసిన 23 సినిమాలతో పోలిస్తే రాజుకు శతమానం భవతి ప్రత్యేకమనే చెప్పాలి.
ఎందుకంటే ఓ సినిమా 90 కోట్లు బిజినెస్ 100 కోట్లు సాధిస్తే హిట్ అనలేం.. ఎందుకంటే కమర్షియల్ గా ఎన్ని డబ్బులు వచ్చినా కొన్న వాళ్లకు మిగిలేది మాత్రం పదో పరకో అంతే..! కానీ ఓ సినిమా 7 కోట్లతో తెరకెక్కి 30 కోట్లు వసూలు చేస్తే అది రియల్ బ్లాక్ బస్టర్. కొన్న ప్రతిఒక్కరికి డబుల్ లాభాలు తీసుకొస్తే అదీ సూపర్ హిట్ అంటే. సంక్రాంతి సమరంలో టాప్ హీరోలతో పోటీ పడి ముందుకువచ్చిన దిల్ రాజు శతమానం భవతి రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు పైగా షేర్.. ఓవరాల్ గా 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది శతమానం భవతి. ఇప్పటికీ వసూళ్లు సూపర్ గా వస్తున్నాయి.
తనకు బాగా పట్టున్న నైజాం ఏరియాతో పాటు వైజాగ్ కూడా తనకే ఉంచుకుని.. మిగతా ఏరియాల హక్కులన్నింటినీ అమ్మేశాడు. ఈ అమ్మకాలతోనే దాదాపుగా రాజుకు పెట్టుబడి గిట్టుబాటు అయిపోయినట్లు సమాచారం. నైజాం, వైజాగ్ వసూళ్లన్నీ దిల్ రాజు పంటపండించాయి. నైజాంలో అనూహ్యంగా రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చిపెట్టగా … వైజాగ్ ఏరియాలో రూ.5 కోట్ల షేర్ తెచ్చింది. ఈ రెండు ఏరియాలతో వచ్చిన రూ.15 కోట్ల షేర్ రాజుకు దక్కిన లాభం.
ఇక ‘శతమానం భవతి’ శాటిలైట్ డీల్ అయ్యిందో లేదో క్లారిటీ లేదు. ఇప్పుడు కనుక ఆ సినిమాను అమ్మితే ఈజీగా రూ.5 కోట్లు ఖాతాలో పడబోతున్నట్లే. విడుదలకు ముందే డీల్ పూర్తి చేసి ఉన్నా 3-4 కోట్ల మధ్య వచ్చి ఉంటుంది. ఆడియో హక్కులు ఇతరాలు కలిపితే మొత్తంగా రాజుకు ఎలా కాదన్నా రూ.20 కోట్ల లాభంతో ఫుల్ జోష్ మీదున్నాడట.