కాటమరాయుడులో మహేష్‌ …?

196
Mahesh in Pawan's Katamarayudu?
- Advertisement -

కాటమరాయుడు మూవీలో స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతుందా? అంటే రీసెంట్ గా అలాంటి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిళ్లో వినిపిస్తొంది. సినిమాలో పవన్ కు మించిన అట్రాక్షన్ ఏముంటుంది అంటే.. దర్శకుడు డాలీ ఓ స్టార్ హీరోతో అతిథి పాత్ర వేయించేందుకు సిద్ధమవుతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు.

కాటమరాయుడు సెకండ్ ఆఫ్ లో మహేష్ కు సరిపడే విధంగా ఒకచిన్న అతిథి పాత్రను దర్శకుడు డాలీ  క్రియేట్ చేసినట్లు సమాచారం. మహేష్ పోషించే పాత్ర చిన్నదైనా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. డాలీకి వచ్చిన ఆలోచన ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ హీరో పవన్ లకు కూడ నచ్చడంతో ఈవిషయమై మహేష్ ను ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలలైనట్లు వార్తలు వస్తున్నాయి.

అదే నిజమైతే.. కాటమరాయుడు కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమే. పవన్ కల్యాన్‌, మహేష్ బాబు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. జల్సా సినిమాకు మహేష్ వాయిస్ కూడా ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపధ్యంలో కాటమరాయుడులో మహేష్ అతిథి పాత్ర చేయడం పెద్ద విషయమేమి కాదు. అయితే.. ఈ వార్త నిజమా? కాదా తేలాల్సి ఉంది.

- Advertisement -