అల్లు అర్జున్ ‘ఐకాన్’పై దిల్‌ రాజు క్లారిటీ..

177
dil raju
- Advertisement -

అల్లు అర్జున్ నెక్ట్స్‌ మూవీ ‘ఐకాన్’ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈరోజు దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి ఆయన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు స్పందిస్తూ.. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఐకాన్’ అనే విషయాన్ని తేల్చి చెప్పాడు. ‘ఐకాన్’ నాకు బాగా నచ్చిన కథ .. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక, వెంటనే ఈ సినిమాను మొదలెట్టబోతున్నామని స్పష్టం చేశాడు.

అయితే వాస్తవానికిని బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమా చేయడానికి ముందే ‘ఐకాన్’ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. దిల్ రాజు నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. అలాంటి ప్రాజెక్టుకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ‘పుష్ప’ తరువాత బన్నీ చేయనున్న సినిమా ఇదేననే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బన్ని సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -