వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తూనే ఉంటారు. కానీ 99 శాతం ఫెయిల్యూర్.. వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారు. కానీ ప్రభు, పర్వతనేని రాంబాబు వంటి వారు ఉండటం వల్లే మేం అంతా ఇక్కడకు వచ్చాం. ఇలాంటి సినిమాను తీయడం గొప్ప కాదు.. ప్రేక్షకుడ్ని థియేటర్ వరకు తీసుకు రావడం గొప్ప విషయం. రేవు కాన్సెప్ట్ బాగుంది. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమాను తీశారు. కాబట్టి వీళ్ళ సినిమాని చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు.
దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘మురళీ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. రేవు చిత్రాన్ని చూసి ఆయన కొన్నారు. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘సినిమాను నేను చూశాను. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ టైంలోనే ఎన్నారై నిర్మాత మురళీ గారు పరిచయం అయ్యారు. వారు కూడా ఈ సినిమాను చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే, ఉన్న పరిమితులతో ఎంత అద్భుతంగా సినిమాను తీయవచ్చు అనే దానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. డైరెక్టర్ హరినాథ్ అందరి వద్ద నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. సెన్సార్ వాళ్లు కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు.
Also Read:దసరా నుండి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం