కుటుంబమంతా కలిసి చూసే చిత్రం.. ‘ప్రేమలు’

30
- Advertisement -

ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి కామెడీ, లవ్ అనే అంశాలతో ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్బుతమని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ అందించారు. శుక్రవారం (మార్చి 8)న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలో…దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. మలయాళంలో ఫిబ్రవరి 9న ‘ప్రేమలు’ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. మలయాళ సినిమా అయినప్పటికీ హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ చేశారు. మన లొకేషన్స్ చిత్రీకరణ జరిగింది. 90 శాతం కథ హైదరాబాద్ లోనే చిత్రీకరణ చేశారు. అక్కడ రిలీజైన ఈ చిత్రాన్ని రాజమౌళిగారి అబ్బాయి ఎస్.ఎస్.కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. ఆ క్రమంలో నాతో మాట్లాడితే నైజాంలో నేను రిలీజ్ చేస్తానని చెప్పాను. గురువారం ప్రీమియర్ షోస్ వేస్తే ఒక్కో స్క్రీన్ యాడ్ చేసుకుంటూ పోయాం. మొత్తం పది షోస్ వేశాం. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ స్పందన చూస్తుంటే సినిమా మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగానే అన్ని ఏరియాల్లో రిలీజై హిట్ అవుతుందనిపిస్తుంది. ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. ఆదిత్య తెలుగులో డైలాగులను అద్భుతంగా రాశాడు. థియేటర్స్ లో సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఎస్.ఎస్.కార్తికేయ మాట్లాడుతూ ‘‘ప్రేమలు’ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యిందని నాకు తెలియగానే అక్కడి నిర్మాతలను కాంటాక్ట్ అయ్యాను. తెలుగు రిలీజ్ చేయాలనుకుంటున్నానని వారి చెప్పాను. సినిమా మెయిన్ కథంతా హైదరాబాద్ లోనే జరుగుతుంది. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే సినిమా. నేను మలయాళ నిర్మాతలను సంప్రదించగానే వారు నాకు ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం ఇచ్చారు. అందుకు వారికి థాంక్స్. ఆదిత్య ఈ సినిమా డైలాగ్స్ ను 7-8 రోజుల్లో రాసి డబ్బింగ్ చెప్పించేశారు. గొప్పగా సపోర్ట్ చేశారు. వారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

ఆదిత్య మాట్లాడుతూ ‘‘ప్రేమలు’ సినిమా చూస్తుంటే మనల్ని మనం చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ప్రతీ క్యారెక్టర్ అందరికీ రిలేట్ అవుతుంది. అందుకనే అలాంటి డైలాగ్స్ రాయాలనిపించి రాశాను. ఈ టీమ్ తో కలిసి పని చేయటం సంతోషంగా ఉంది. చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్. మీ గ్యాంగ్ తో కలసిి సిినిమా చూడండి రోలర్ కోస్టర్ రైడ్ లా సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు.

Also Read:IND vs ENG : భారీ ఆధిక్యంలో భారత్ !

- Advertisement -