‘వరుడు కావలెను’.. దుమ్ములేపుతున్న మాస్‌ సాంగ్..

239
Digu Digu Digu Naaga Lyrical
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ‘వరుడు కావలెను’ చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘దిగు దిగు దిగు నాగ’ అనే మాస్‌ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ పాటను తమన్ స్వరపరిచగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ పాడారు. మాస్ సాంగ్స్‌కి అదిరిపోయో డాన్స్ మూవ్‌మెంట్స్ కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించారు. తెలంగాణలో ‘దిగు దిగు దిగు నాగ’ అనేది చాలా పాప్యులర్ అయిన జానపద గీతం. ఈ పాటను ఆ లైన్ తో మొదలుపెట్టి, అదే బాణీలో సినిమా సాహిత్యాన్ని అల్లారు. ఆడియన్స్ నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

- Advertisement -