ఎమ్ ఎస్ కె ప్రమిద శ్రీ ఫిలింస్ పతాకంపై అనిశెట్టి వెంకట సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, ఎమెఎస్‌కె రాజు నిర్మాతలుగా కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ సుందరాంగుడు
. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించిన టీజర్ తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో కృష్ణ సాయి పాల్గొన్నారు.
టీజర్ రిలీజ్ చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి మాట్లాడుతూ…కృష్ణ సాయి హీరోగా నటించిన సుందరాంగుడు టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. టీజర్ లో కృష్ణ సాయి నటన బావుంది. దర్శక నిర్మాతలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా మంచి గుర్తింపునివ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
అన్నారు.
ఈ సందర్భంగా హీరో స్పెషల్ స్టార్ కృష్ణ సాయి మాట్లాడుతూ…మా చిత్రానికి సంబంధించిన టీజర్ తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్ బావుందంటూ ఎంతో ప్రశంసించారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా టీజర్ రిలీజ్‌కు ఎవర్నీ ఆహ్వానించలేకపోయాం. త్వరలో చేయబోయే ట్రైలర్ ఆవిష్కరణకు అందర్నీ ఆహ్వానిస్తాము. కోవిడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మేము అడగ్గానే మా టీజర్ ఆవిష్కరించిన సుమతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హీరోగా చేయాలన్న నా కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని.... క్రిష్ణ గారి సినిమాలు ప్రతి సినిమా చూసే వాణ్ణి. ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటోన్న తరుణంలో మంచి కథతో వచ్చారు డైరెక్టర్ వినయ్ బాబు గారు . సుందరాంగుడు కథ కథనాలు నాకు బాగా నచ్చాయి. నా బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా స్టోరీ ఉంటుంది. ఇక పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. సుందరాంగుడు.. అన్ని సినిమాల లాగా కాదు. విభిన్నమైన కామెడీ సినిమా.. ఈ సినిమా లో హీరో క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. హీరో .. జమీందార్.. బిడ్డ... డబ్బు అహంకారం తో అన్ని నాకే దక్కాలని.. అందమైన అమ్మాయిలను వశపర్చు కోవాలని అమ్మాయిలు వెంట పడుతుంటాడు... కానీ అతని కి ఏ ఒక్క అమ్మాయి పడకపోగా...ప్రతి అమ్మాయి అవమానిస్తుంది. తనను అవమాన పరిచిన అమ్మాయిలను ఎలా వశపర్చుకున్నాడు అన్నది కథ. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.. మనిషి కి మనసు సుందరంగా ఉండాలి కానీ.. మనిషి సుందరంగా ఉన్నంత మాత్రాన. .. నిజమైన అందగాడు కాదు... మనిషి కి మంచి మనసే నిజమైన అందం అనే అంశాన్ని మా సినిమాలో చెబుతున్నాం
అన్నారు.
కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా అమిత్ తివారి నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో జీవా, జూ రేలంగి, బాషా , మిర్చి మాధవి, రీతు, ఇషా , ములికి సత్యనారాయణ తదితరులు నటిస్తున్నారు.
ఎడిటింగ్: నందమూరి హరి
ఫైట్స్: రామ్ సుంకర
కొరియోగ్రఫీ: పాల్, సూర్య కిరణ్
డీ ఓ పి: వెంకట్ హనుమాన్
మ్యూజిక్: సిద్ధ బాపు
నిర్మాతలుః బీసు చందర్ గౌడ్, ఎమ్మెస్ కె రాజు
కథ, కథనం, మాటలు, పాటలు,దర్శకత్వం : ఎం. వినయ్ బాబు