నితిన్‌ ప్రేమలో మేఘా..? ఇదిగో క్లారిటీ..!

635
- Advertisement -

టాలీవుడ్లో సక్సెస్‌లతో దూసుకుపోతోన్న యంగ్‌ హీరో నితిన్‌ ‘లై’ హీరోయిన్‌ మేఘా ఆకాష్‌తో రొమాన్స్‌ చేస్తున్నాడని, వీరిద్దరూ డీప్‌ లవ్‌లో ఉన్నారని ఇటీవలే సోషల్‌ మీడియాలో వార్తలు హల్చల్‌ చేశాయి. దీనికి కారణం నితిన్‌, మేఘాఆకాశ్‌ జంట మళ్ళీ రిపీట్‌ అవుతుండమే.

 heroine megha aakash opened  her love

‘లై’ సినిమాలో హీరోయిన్‌గా మేఘా ఆకాష్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా హీరో నితిన్‌‌కు ఎంత పేరు వచ్చిందో హీరోయిన్‌కు కూడా అంతే పేరు వచ్చింది. అందుకే వీళ్లిద్దరూ కలిసి మరో సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయారు.

కానీ ‘లై’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని..ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్ ఇటీవలి కాలంలో బాగా వినపడుతోంది. ఈ కారణం వల్లే నితిన్‌ తన తరువాతి సినిమాలో మేఘా ఆకాష్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాడన్నది చాలా మంది అభిప్రాయం.

 heroine megha aakash opened  her loveఅయితే ఈ రూమర్లపై మేఘా ఆకాష్ రియాక్ట్‌ అయింది. అవన్నీ ఒట్టి గాలి కబుర్లే అని మేఘా ఆకాష్ కొట్టిపారేసింది. నితిన్‌కూ తనకూ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్పూ లేదనీ, ‘లై’ సినిమా సమయంలోనూ ఈ సినిమాకీ డేట్లు అడిగారనీ, అందుకే అడ్జస్ట్ చేయగలిగాననీ అంటోంది. తన నటన నచ్చి తీసుకున్నారే తప్ప మా ఇద్దరి మధ్య మరో కారణం లేదనీ స్పష్టం చేస్తోంది.

- Advertisement -