నిమజ్జనం చేయలేని గణపతి…

571
Ganpati Bappa
- Advertisement -

ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడిని భక్తితో నమస్కరించి తొలిపూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆ ఆదిదేవుడు వినాయకుడు కాపాడతాడని భ క్తాదుల ప్రగాడ విశ్వాసం. దేశం మొత్తంగా ఉత్సవాలను సామూహికంగా నిర్వహించేవి ఒక్క వినాయక ఉత్సవాలు మాత్రమే.

వివిధ రూపాల్లో ఉన్న లంబోదరునికి భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు జరుపుతారు.11 రోజుల పాటు నిత్య పూజలందందుకున్న గణనాధుడు పొట్టనిండా ఉండాళ్లు ఆరగించి ఇక్కడ వర్షాలు లేని కారణంగా దేవతలకు చెప్పి వర్షాలు కురిపిస్తాడని నమ్మకం.

వివిధ అలంకరణల్లో,వివిధ భంగిమల్లో గణేషుడిని తయారుచేసుకుని పూజించడం ఆనవాయితీ. ఇక మహారాష్ట్రలో నెలకొల్పిన వినాయకుడిని నిమజ్జనం చేయరట. డైమండ్ సిటీగా పేరొందిన సూరత్‌లో వజ్రాల వ్యాపారులంతా కలిసి డైమండ్ వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. దీని విలువ అక్షరాలా 600 కోట్లు. దీంతో 11 రోజుల పాటు ఏకదంతుడికి నిత్య పూజలు,అన్న దాన కార్యక్రమాలు చేసి పూజిస్తారు. కానీ నిమజ్జనం మాత్రం చేయరు. ఎందుకంటే ఖరీదైన లంబోదరుడు కదా.

Lord ganesh

- Advertisement -