వజ్రాల వరసిద్ధి వినాయకుడు

431
Diamond Ganesh in Surat
- Advertisement -

ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడిని భక్తితో నమస్కరించి తొలిపూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆ ఆదిదేవుడు వినాయకుడు కాపాడతాడని భక్తాదుల ప్రగాడ విశ్వాసం. 11 రోజుల పాటు నిత్య పూజలందందుకున్న గణనాధుడు పొట్టనిండా ఉండాళ్లు ఆరగించి ఇక్కడ వర్షాలు లేని కారణంగా దేవతలకు చెప్పి వర్షాలు కురిపిస్తాడని నమ్మకం.

దేశ వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక సూరత్‌లోని ఓ గణనాథుడు దేశ వ్యాప్తంగా ఫేమస్. ఎందుకంటే ఈ గణేశుడిని నిమజ్జనం చేయలేం. కారణం వజ్రాలు,బంగారంతో అలంకరించిన ఈ బొజ్జ గణపయ్య ప్రతిఏటా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

దాలియా షేరీ ప్రాంతంలో వజ్రాల వ్యాపారులంతా కలిసి డైమండ్ వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. దీని విలువ అక్షరాలా 600 కోట్లు. గ‌ణేశుడి విగ్ర‌హంలోని చేతులు, కాళ్ల‌ను బంగారంతో తీర్చిదిద్దారు. చేతులు, కాళ్ల‌కు కూడా వ‌జ్రాల‌ను అమ‌ర్చారు. దేశంలో గణేష్ ఉత్సవాలకు ఎన్నో ప్రధాన నగరాలు ఫేమస్‌గా నిలిచినప్పటికి ఈ వజ్రాల గణపయ్య ఎప్పటికీ ప్రత్యేకమే.

Also Read:తులసి గింజలతో ఎన్ని లాభాలో..!

- Advertisement -