డయాబెటిస్ ఉన్నవాళ్ళు వీటిని తింటే డేంజర్!

60
- Advertisement -

నేటిరోజుల్లో చాలమంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య డయాబెటిస్. ఇది చాపాకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి పదిమందిలో కనీసం ఇద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రతిఏటా డయాబెటిస్ కారణంగా ప్రత్యేక్షంగానో లేదా పరోక్షంగానో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి సరైన వైద్యం కూడా అందుబాటులో లేనందువల్ల దీని బారిన పడితే బయటపడడం చాలా కష్టం. అందుకు దీనికి నివారణ ఒక్కటే మార్గం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి కారణాల మనకు తెలియకుండానే షుగర్ వ్యాధి బారిన పడుతుంటాము. కాబట్టి ఆహారపు అలవాట్లలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

షుగర్ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందువల్ల చాలమంది స్వీట్స్, తీపి పదార్థాలకు దూరం పాటిస్తుంటారు. కానీ పండ్ల విషయంలో మాత్రం జాగ్రత్త వహించారు. ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రతి పండుకు కూడా నిరభ్యంతరంగా తింటూ ఉంటారు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పండ్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా చక్కెర కారకమైన ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పండ్ల ను తింటే మధుమేహం మరింత పెరిగే ప్రమాదం ఉందట.

అరటిపండు, సీతాఫలం, పనస, మామిడి వంటి ఫలాలలో సహజసిద్దంగానే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరెంజ్, యాపిల్, కర్భుజ, పొప్పడి వంటి పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చట. ఇందుల్లో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసే పోషకాలు ఈ పండ్లలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వేటిని తినాలి, వేటిని తినకూడదు అనే వాటిపై అవగాహన ఉంటే షుగర్ వ్యాధి పెరగకుండా నిరోదించవచ్చు.

Also Read:Supreme Court:ఇకపై అన్ని కేసులు ప్రత్యక్షప్రసారం

- Advertisement -