రాష్ట్రంలో కొత్తగా 2,524 కరోనా కేసులు..

32

తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసుల తీవ్ర‌త కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 2,524 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 18 మంది మ‌ర‌ణించారు. 3,464 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 34,084 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంట‌ల్లో 87,110 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 307 పాజిటివ్ కేసులు, న‌ల్ల‌గొండ జిల్లాలో 183, రంగారెడ్డి జిల్లాలో 142, ఖ‌మ్మం జిల్లాలో 134, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 128 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.