‘ధురంధర్ 2’..బాక్సాఫీస్ సెన్సేషన్

6
- Advertisement -

ధురంధర్ 2 ది రీవెంజ్.. చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ 11 రోజుల్లోనే చరిత్ర సృష్టించింది. ఆ సినిమా విడుదలైన తొలి వారం ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత్‌లోనే మొదటి వారాంతానికి ₹674 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.

వారం మధ్యలో కొద్దిగా తగ్గిన కలెక్షన్లు, రెండో వీకెండ్‌లో మళ్లీ పెరిగాయి. మొత్తంగా 11 రోజుల్లో దేశీయంగా ₹847 కోట్ల నెట్ (₹1012 కోట్ల గ్రాస్) సాధించింది. దీంతో హిందీ సినిమాల్లో అత్యధిక డొమెస్టిక్ కలెక్షన్ రికార్డును సొంతం చేసుకుంది.

ఓవర్సీస్‌లో కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. మొత్తం $38 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.ప్రస్తుతం సినిమా గ్లోబల్ కలెక్షన్ ₹1365 కోట్లకు చేరుకుంది. ఇప్పటికే తొలి భాగం Dhurandhar (₹1307 కోట్లు) రికార్డును దాటేసింది.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

- Advertisement -