విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది DGCA. ఏప్రిల్ 20 నుంచి ప్రతి విమానంలో కనీసం 60% సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
డీజీసీఏ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం:
ప్రతి విమానంలో కనీసం 60% సీట్లు ఉచితంగా ఇవ్వాలి
సీట్ల కేటాయింపులో పారదర్శక విధానం పాటించాలి
ఉచిత సీట్ల వివరాలను బుకింగ్ సమయంలో స్పష్టంగా చూపించాలి
ఈ సర్క్యులర్ మార్చి 20న విడుదలై, 30 రోజుల తరువాత అంటే ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం కేవలం 20% సీట్లను మాత్రమే ఉచితంగా ఎంచుకునే అవకాశం ఉంది. మిగతా సీట్లకు రూ.200 నుంచి రూ.2100 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొత్త నియమంతో ప్రయాణికులకు అదనపు ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
డీజీసీఏ సూచనల ప్రకారం..
ఒకే PNR (టికెట్)లో ఉన్న ప్రయాణికులను వీలైనంతవరకు పక్కపక్కనే కూర్చోబెట్టాలి
క్రీడా సామగ్రి, సంగీత వాద్యాలు వంటి అదనపు సేవలపై ఛార్జీలు, నష్టపరిహారం నిబంధనలు కూడా విమాన సంస్థలు స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది.
Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!
ఈ నిర్ణయాన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి సంస్థలు ఈ నిర్ణయం వల్ల ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నాయి. అదనంగా, ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. డీజీసీఏ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ప్రయోజనం కలిగించేలా కనిపిస్తున్నప్పటికీ, విమాన సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో టికెట్ ధరలపై ఎలా ఉంటుందో చూడాలి.

