అది 2016 ఒక రోజు టాప్ డైరెక్టర్, టాప్ హీరో కూర్చొని సినిమాపై డిస్కషన్ జరిపి షూటింగ్ ప్రారంభించారు. అంతలోనే ఆ సినిమాకు అవాంతారాలు ఎదురయ్యాయి. అలా గడిచి ఏడు సంవత్సారాలు వచ్చింది. చివరికి సినిమా షూటింగ్ పూర్తైంది. ఇందులో డైరెక్టర్ కొత్త కాదు..హీరో కొత్త కాదు వీరిద్దరికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. అయినా ఇన్నేళ్లు ఎందుకు సమయం పట్టిందంటే… ఏమో అని కోలీవుడ్‌లో టాక్. మరీ విషయాల్లోకి వెళ్తే…
షియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ధృవ నచ్చతిరమ్. తమిళంలోని పెద్ద పెద్ద స్టార్లను లాంచింగ్ ఈవెంట్‌కు పిలిచి గ్రాండ్‌గా నిర్వహించారు. విక్రమ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ కేటాయించిన సినిమాగా రికార్డులెక్కింది. ఈ సినిమా షూటింగ్‌ను ఏడు దేశాల్లో పూర్తి చేశారు. అయితే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. అన్నట్టు గౌతమ్ మీననే ప్రొడ్యూసర్. ఆయనతో పాటు మరో ఇద్దరికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో బడ్జెట్ తేడాల వల్ల ఈ సినిమాకు బ్రేకుల మీద బ్రేకులు పడ్డాయి.
గతేడాది పొన్నియన్ సెల్వన్‌తో భారీ హిట్ అందుకొని క్రేజ్ అమాంతం పెంచేసుకున్నాడు. దీంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన గౌతమ్ ఈ సినిమాను పూర్తి చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, సతీష్ లాంటి స్టార్ల్‌లు నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా లైన్‌ను ముందుగా సూర్యతో ప్లాన్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి…