బంగ్లా టూర్‌..ధోనికి చోటు దక్కేనా..!

517
dhoni
- Advertisement -

ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి రెండు నెలల పాటు విరామం ప్రకటించిన ధోని భవితవ్యం ఏంటా అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టూర్‌కి భారత జట్టును ఈ నెల 24న ఎంపికచేయనుంది బీసీసీఐ.

గంగూలీ సారథ్యంలో జరిగే తొలి బీసీసీఐ సమావేశంలో ధోని తిరిగి జట్టులో  చేరుతాడా లేదా అన్నదానిపై స్పష్టత రానుంది. ధోని భవితవ్యంపై సెలక్టర్లతో చర్చిస్తానని ఆ తర్వాత తన అభిప్రాయాన్ని వారికి చెబుతానని వెల్లడించారు గంగూలీ. ధోనితో మాట్లాడి..అతడి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని దాదా తెలిపాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. ఈ సిరీస్ కోసం ఈనెల 24న జట్టుని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు.

- Advertisement -