ధోనిపై వసీం ఆసక్తికర కామెంట్స్..!

363
dhoni
- Advertisement -

ధోని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జాఫర్..కెరీర్ తొలినాళ్ల‌లో భార‌త జ‌ట్టులోకి వచ్చిన ఏడాది, రెండేండ్ల‌లో అనుకుంటా..నాకు బాగా గుర్తు ధోనీ జీవితాంతం ప్ర‌శాంతంగా బ్ర‌త‌కడానికి రూ.30 ల‌క్ష‌లు సరిపోతాయ‌ని ధోని చెప్పాడన్నాడు. .

దేశ క్రికెట్‌కు ఎన్నో చిర‌స్మ‌రణీయ విజ‌యాలందించిన ధోనీ..ప‌లు ప్ర‌ముఖ కంపెనీల ఎండార్స్‌మెంట్ల‌తో కోట్లు ఆర్జించాడు. ప్ర‌పంచ క్రికెట్‌లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్న మ‌హీ బైక్ లవర్ అన్న విషయం తెలిసిందే. మార్కెట్లో కొత్త లగ్జరీ బైక్ వస్తే మహీ గ్యారేజ్‌లో ఉండాల్సిందే.

ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తాచాటి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న మహీ ఆశలపై కరోనా రూపంలో గండిపడింది. ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ వాయిదా పడగా అసలు టోర్నీ జరుగుతుందా లేదా అన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

- Advertisement -