అదేంటి…వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దావా వేయటం ఏంటనుకుంటున్నారా..అదేం కాదులేండి బాబు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి గ్రూప్‌పై న్యాయపోరాటానికి దిగారు దోని. రూ. 150 కోట్ల బకాయిలను అమ్రపాలి గ్రూప్ చెల్లించాలని ధోని కేసు దాఖలు చేశారు.
ధోనితో పాటు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్,భువనేశ్వర్ కుమార్,దక్షిణాఫ్రికా క్రికెట్ డుప్లెసిస్ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న తనకు ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు రూ. 200 కోట్లు క్రికెట్లరకు బకాయి ఉన్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేయలేకపోతోంది. అంతేగాదు హౌజింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకపోవడంతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో దోని 2016లో బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకున్నాడు.