చివరి మ్యాచ్‌ లేకుండానే పుల్‌ స్టాప్ పెట్టేశాడు!

351
dhoni
- Advertisement -

క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన మహీ…రీఎంట్రీపై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఉహించని విధంగా షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు ధోని. దీంతో తన రిటైర్మెంట్‌పై జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టేశాడు.

ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మ‌ద్ద‌తుకు ధ‌న్యావాదాలు అంటూ తెలుపుతూనే..ఆదివారం రాత్రి 7 గంట‌ల 29 నిమిషాల నుంచి రిటైర్ అయిన‌ట్లుగా భావించాల‌ని త‌న కామెంట్‌లో పోస్టు చేశాడు ధోని.

మిస్ట‌ర్ కూల్‌గా,సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు ధోని. హెలికాప్ట‌ర్ షాట్‌తో కష్టకాలంలో జట్టును విజయతీరాలకు ఎలా నడిపించవచ్చో కళ్లకు కట్టినట్టు చూపించాడు ధోని.

350 వ‌న్డేల్లో 10,773 రన్స్ చేయగా 90 టెస్టులు ఆడిన ధోని 4876 పరుగులు చేశాడు. 98 టీ20ల్లో 1617 పరుగులు చేసిన మహీ …ఈ ఏడాది ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండోరోజే రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

- Advertisement -