సోషల్ మీడియాలో వైరల్‌గా ధోని లుక్‌!

87
dhoni

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. ఇప్పటివరకు రకరకాల హెయిర్ స్టైల్‌లతో ఆకట్టుకున్న ధోని తాజాగా నెరిసిన గడ్డంతో దర్శనమిచ్చాడు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు ఆసక్తిక కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

రాంచీలోని ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు ధోని. ఇటీవలె స్వయంగా ట్రాక్టర్‌తో నేలని చదును చేస్తూ.. విత్తనాల్ని వేస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తర్వాత తన కూతురు జీవాతో కలిసి బైక్‌పై షీకార్ చేయగా తాజాగా నెరిసిన గడ్డంతో దర్శనమిచ్చాడు మహీ.

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన ధోనీ.. ఆ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక జులై 7న 39వ పడిలోకి ధోనీ అడుగుపెట్టనుండగా.. ట్విట్టర్‌లో ఇప్పటికే #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారిపోయింది.