- Advertisement -
రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదన్నారు డీహెచ్‌వో శ్రీనివాస్. తిరిగి లాక్ డౌన్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యాసంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని.. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదమని హెచ్చరించారు. కరోనా నియంత్రణకు గతేడాది ఎలాంటి చర్యలు చేపట్టామో.. ఇప్పుడూ అవే మళ్లీ మొదలయ్యాయని తెలిపారు.
పాజిటివ్ కేసుల పెరుగుదలను బట్టి సెకండ్ వేవ్ అనే భావిస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని, వ్యాక్సినేషన్ పెరిగితే వైరస్ నియంత్రణలోకి వస్తుందన్నారు.
- Advertisement -