ఓపెనర్‌గా విరాట్..క్లారిటీ!

65
virat

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఐదో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. చివరివరకు క్రీజులో ఉన్న విరాట్..మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఇకపై ఓపెనర్‌గా వస్తారా అని సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చనడుస్తుండగా దీనిపై క్లారిటీ ఇచ్చారు కోహ్లీ.

ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌బోయే వ‌న్డే సిరీస్‌లో శిఖ‌ర్ ధావ‌న్‌, రోహిత్ శ‌ర్మ‌నే ఓపెనింగ్ చేయ‌నున్న‌ట్లు స్పష్టం చేవారు. వ‌న్డేల విష‌యంలో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేదు… వాళ్లు కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు అని అన్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ చూస్తే ఇండియా త‌ర‌ఫున రోహిత్‌, ధావ‌న్‌ది మూడో అత్యుత్త‌మ ఓపెనింగ్ జోడీ. వీళ్లు 109 ఇన్నింగ్స్‌లో 44.87 స‌గ‌టుతో 4878 ప‌రుగులు చేశారు. అందులో ఓపెన‌ర్లుగా 107 ఇన్నింగ్స్‌ల్లో 4802 ప‌రుగులు చేశారు. ఇది ఇండియా త‌ర‌ఫున వన్డే క్రికెట్‌లో సెకండ్ బెస్ట్‌.