గబ్బర్ గమ్మత్తు చూశారా..!

218
Dhawan plays a hilarious prank on teammates Rashid Khan
- Advertisement -

టీమిండియా ఆటగాళ్లలో గబ్బర్ అదేనండి శిఖర్ ధావన్,యువీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమ్ మేట్స్‌ను ఆటపట్టించడంలో ఎప్పుడూ వీరు ముందుంటారు. తాజాగా ఐపీఎల్‌ సందర్భంగా ధావన్ చేసిన సరదా సన్నివేశం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన సన్‌ రైజర్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు గబ్బర్. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో తలపడేందుకు మొహాలి చేరుకుంది సన్ రైజర్స్ టీం. ఈ సందర్భంగా విమానంలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబుల్ హసన్, ఆఫ్ఘన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌లను ఆటపట్టించాడు.

ఈ ఇద్దరూ విమానంలో ఆదమరచి నిద్రపోతున్నారు. ఈ సమయంలో ధావన్ ఓ పేపర్ ముక్కను చుట్టి వాళ్ల ముక్కుల్లో పెట్టడం, ఏం జరిగిందో తెలియక సడెన్‌గా వాళ్లు మేల్కొనడం చూస్తే నవ్వొస్తుంది.ధావన్ చిలిపి చేష్టలు చూసి విమానంలోని వారందరూ పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

https://youtu.be/V815W4rTyOc

- Advertisement -