ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడోరోజే ఐదో టెస్టు ముగియగా టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 259 పరుగుల లీడ్‌ను సాధించగా రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక రూట్ మినహా మిగితా వారంతా ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. రూట్ 84 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక అశ్విన్ స్పిన్ ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 195 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ కాగా టీమిండియా 64 రన్స్‌తో విజయం సాధించింది. అశ్విన్ 6 వికెట్లు తీశాడు.
వరుసగా నాలుగో విజయంతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా యశస్వీ జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నారు.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ను ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లో చేరగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Also Read:#DNS..’కుబేర’ ఫస్ట్ లుక్